బిగ్ న్యూస్‌.. బిగ్ బాస్‌పై ఏపీ హైకోర్టు విచార‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

బిగ్ బాస్‌.. అంటే ఇప్పుడు తెలియ‌ని వారు లేరు.. ఎన్నో భాష‌ల్లో ప్ర‌సారం అవుతున్నా.. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల నుంచి భారీగా స్పంద‌న వ‌స్తోంది.

Update: 2022-05-03 10:58 GMT

బిగ్ బాస్‌.. అంటే ఇప్పుడు తెలియ‌ని వారు లేరు.. ఎన్నో భాష‌ల్లో ప్ర‌సారం అవుతున్నా.. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల నుంచి భారీగా స్పంద‌న వ‌స్తోంది. ఇప్ప‌టికే సక్సెస్‌ఫుల్ షోగా 5 సీజ‌న్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్. టీఆర్పీ రేటింగ్ లో నెంబ‌ర్ వ‌న్ గా నిలుస్తోంది. దీనికి తోడు ఈ షో ఇప్పుడు 24 గంటల పాటు ఓటీటీ వేదికగా ప్రసారం అవుతోంది. కంటెంట్ కొంత అస‌భ్య‌క‌రంగా ఉన్న‌ప్ప‌టికీ జ‌నాల నుంచి రెస్పాన్స్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. సినీ హీరోలు, సీరియ‌ల్ ఆక్ట‌ర్స్, సోష‌ల్ మీడియా సెలెబ్రేటీస్‌, టీవీ యాంక‌ర్లు, హాట్ సెలెబ్రేటీస్‌, క‌మీడియ‌న్స్, క్రిటిక్స్, ఇలా న‌వ‌స‌రాలు క‌ల‌గ‌లిపిన షో బిగ్ బాస్‌.. ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన అన్ని ర‌కాల ఎంట‌ర్టైన్ మెంట్ దొరుకుతుంది.. అయితే ఒక‌ప్పుడు బిగ్ బాస్ అంటే ఆస‌క్తి ఫ్యామిలీతో క‌లిసి చూసేలా ఉండేది.. సీజ‌న్లు పెరుగుతున్న కొద్ది షోలో అస‌భ్య‌క‌ర స‌న్నివేశాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీనిపై కొంద‌రు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ కోర్టుల‌ను సైతం ఆశ్ర‌యించారు. ఫ్యామిలీస్ తో చూసే షోలో ఇలాంటి అస‌భ్య‌క‌ర విజ్యువ‌ల్స్ ఎలా చూపిస్తారంటూ వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ఏపీ హైకోర్టు స్పందించింది.. ఈ విష‌య‌మై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసింది.


టాస్క్ పేరిట రోమాన్స్.. విచార‌ణ‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌..!
బిగ్ బాస్‌ షోలో ప్ర‌తి ఎపిసోడ్ లో ఒక టాస్క్ ఉంటుంది.. కొన్ని ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుండ‌గా.. మ‌రి కొన్ని అస‌భ్య‌క‌ర‌మైన సీన్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.. టాస్క్ ల పేరుతో అమ్మాయిల‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ట‌చ్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్లు బిబ్ బాస్ చెప్పిన‌ట్లుగా గేమ్ రూల్స్ పాటిస్తూ ఆడాల్సి ఉంటుంది.. ఇందులో భాగంగానే ఒక ఎపిసోడ్ లో కంటెస్టెంట్లు అందరికీ బిగ్ బాస్ స్విమ్మింగ్ ఫూల్ లో డ్యాన్స్ చేసే టాస్క్ ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ ఆట‌లో హౌజ్ స‌భ్యులంతా ఆడాల్సి ఉంటుంది.. అయితే ఇక్క‌డ బిగ్ బాస్ ఎక్కువ మంది అమ్మాయిల‌కే చాన్స్ ఇచ్చారు.. ఫూల్ లో త‌డిసిన బ‌ట్ట‌ల‌తో గేమ్ ఆడుతున్న అమ్మాయిల అందాలను బిగ్ బాస్ హైలైట్ చేసింది. ఈ ఆట‌లో అబ్బాయిలు కూడా ఉండ‌డం.. అమ్మాయిలను గలీజుగా చూపించడం.. రొమాన్స్ పై ఫోకస్ చేయడంతో అది అసభ్యకరంగా కనిపించింది. ఇలాంటి స‌న్నివేశాలు చూపిస్తూ స‌మాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.. వీటిని కండిస్తూ.. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ సహా ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షోలో అసభ్యక‌ర‌, అశ్లీలత శ్రుతిమించుతోందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లోనే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.. అయితే బిగ్ బాస్ రియాలిటీ షోపై దాఖలైన పిటిషన్‌పై మే 2న ఏపీ హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది.. దానిపై సోమవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్‌ ఎస్‌.సుబ్బారెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌ రెడ్డి ఇటీవల కోర‌డం జ‌రిగింది. దానికి అంగీకరించిన ధర్మాసనం విచారణ చేసింది. విచార‌ణ అనంత‌రం బిగ్ బాస్ షోపై ఆంక్ష‌లు విధిస్తారా.. లేక ఇలాగే క‌టిన్యూ చేయిస్తారా అనేదానిపై జ‌నాల్లో ఆస‌క్తి నెల‌కొంది.


Tags:    

Similar News