నేటి నుంచి ఏపీలో గ్రూప్-1 మెయిన్స్..ఇవీ కండీషన్స్

జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 11 పరీక్షా కేంద్రాల్లో..;

Update: 2023-06-03 00:30 GMT
ap group 1 mains exams

ap group 1 mains exams

  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో నేటి (జూన్3) నుంచి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను నిర్వహించేందుకు మొత్తం 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ పరీక్ష రాయడానికి ప్రిలిమ్స్ లో మొత్తం 6,455 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 11 పరీక్షా కేంద్రాల్లో.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు 9.30 గంటల నుంచి 9.45 లోగా పరీక్షా కేంద్రాల్లో తమకు కేటాయించిన గదుల వద్దకు చేరుకోవాలి. ఉదయం 8.30 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు తెరుస్తామన్నారు.

పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ వంటి చర్యలకు పాల్పడేందుకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో పరీక్షల నిర్వహణను వీక్షించేలా సీసీకెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ లకు అనుసంధానించారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకొచ్చేందుకు అనుమతి లేదు. కాగా.. తొలిసారి మెయిన్స్ పరీక్షల్లో బయోమెట్రిక్ తో పాటు ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు.


Tags:    

Similar News