పార్టీలో ఉండాలా? వద్దా? బుద్దా వెంకన్న

ఒక్కోసారి పార్టీలో ఉండాలా? వద్దా? అనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు

Update: 2024-12-17 07:35 GMT

ఒక్కోసారి పార్టీలో ఉండాలా? వద్దా? అనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. జోగి రమేష్ తో వేదిక పంచుకున్న ఘటన సరికాదన్నఆయన నిన్నటి ఘటనతో క్యాడర్ మొత్తం బాధపడిందన్నారు. బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్ తో టీడీపీ మంత్రి, నేతలు ర్యాలీ చేయడం బాధించిందన్నార. వారితో టీడీపీ నేతలే అంటకాగితే.. తామేం పోరాటాలు ఎలా చేయాలని ఆయన ప్రశ్నించారు. దీనిపై అధిష్టానం స్పందించి తమకు మార్గదర్శనం చేయాలని కోరారు. నాడు చంద్రబాబు ఇంటి పై దాడికి వెళ్లిన జోగి రమేష్ ను తాము అడ్డుకున్న సమయంలో జరిగిన వివాదం వంటి అంశాలతో ఫోటోలను టిడిపి నేత బుద్ధా వెంకన్న ప్రదర్శించారు.


బాబు ఇంటి మీదకు వచ్చి...

చంద్రబాబు ఇంటి పైకి వెళ్లిన వ్యక్తి జోగి రమేష్ నీచంగా దూషణలు చేసి... చంద్రబాబు కు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేష్ అనిటిడిపి నేత బుద్ధా వెంకన్న అన్నారు. అటువంటి నాయకుడితో టిడిపి మంత్రి, నేతలు కలిసి ర్యాలీ చేయడం బాధ కలిగించిందన్నారు. జోగి రమేష్ తో వేదిక పంచుకున్న ఘటన తో చంద్రబాబు గుండెలు మీద తన్నిన విధంగా ఉందన్నారు. తమ నాయకులను తాను ఏమీ అనలేనని, .. కానీ అలా జరగకుండా చూసుకోవాల్సిందని అన్నారు. జోగి రమేష్ ను తాము అడ్డుకుని ఉండకపోతే ఆరోజు చంద్రబాబు ఇంటి గేటును తాకేవాడన్నారు.తాము అడ్డుకున్న సమయంలో పోలీసులు తమపై దాడి చేశారన్నబుద్దా వెంకన్న 23 స్థానాల నుంచి మళ్లీ ఈ విజయం అందుకున్నాం అంటే ఒకేఒక్క నేత చంద్రబాబు వల్లే సాధ్యం అయ్యిందన్నారు.తామంతా ఆయన అడుగు జాడల్లో నడిచి పని చేశామని, చంద్రబాబు పై అభిమానం తో తాము పోరాటాలు చేశామని చెప్పారు. జోగి రమేష్ వంటి వ్యక్తులను టిడిపి లో అస్సలు చేర్చుకోకూడదని బుద్దా వెంకన్న అన్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now  



Tags:    

Similar News