Supreme Court : నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంలో విచారణ

తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది

Update: 2024-10-03 01:55 GMT

vote for note

తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని హిందువుల మనోభావాలను దెబ్బతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా వేర్వేరుగా పిటీషన్లు వేసిన సంగతి తెలిసిందే.

దర్యాప్తుపై...
దీనిపై నాలుగు రోజుల క్రితం విచారించిన సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న ఆధారాలు లేవని అభిప్రాయపడింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంకు విచారణకు కూడా ఆదేశించింది. కానీ సిట్ విచారణ జరిపితే ఏకపక్షంగా విచారణ సాగుతుందని పిటిషనర్ల తరుపున న్యాయవాదులు చెప్పారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని కోరారు. అయితే దీనిపై సోలిసిటర్ జనరల్ అభిప్రాయం తీసుకుని అక్టోబరు 3వ తేదీన ప్రకటిస్తామని తెలిపింది. దీంతో నేడు దర్యాప్తు ఎవరి చేతుల్లోకి వెళ్లనుందన్నది నేడు సుప్రీంకోర్టు తేల్చనుంది.


Tags:    

Similar News