Rain Alert : తీరం దాటిన వాయుగుండం.. అయినా తప్పని ముప్పు

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో రెండు రోజుల పాటు రెడ్ అలెర్ట్ జారీ చేశారు

Update: 2024-09-01 03:36 GMT

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అనేక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరంచింది. మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తడిసిముద్దయిపోయాయి. నిత్యావసరాలు తెచ్చుకోవడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. రోడ్లపై నీరు నిలిచి ఉండటంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి

గతంలో ఎన్నడూ లేని విధంగా...
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. విజయవాడ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షపాతం నమోదయింది. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే కొందరు పునరావాస కేంద్రాల్లోకి వచ్చేందుకు ఇష్టపడకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. విజయవాడలో గత ఇరవై ఏళ్లుగా ఎన్నడూ లేని పరిస్థితులను చూశామని స్థానికులు చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సౌకర్యాన్ని కూడా అధికారులు తొలగించారు. తాగు నీటికి కూడా ఇబ్బందికరంగా ఉందని స్థానికులు వాపోతున్నారు.
రెండు రోజులు రెడ్ అలెర్ట్...
మరోవైపు తెలంగాణలో రెండు రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వాగులు, వంకలు దాటవద్దని హెచ్చరించింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 24 గంటలు కార్యాలయంలోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. నిన్న అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 29.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. జాతీయ రహదారులపై కూడా నీరు చేరడంతో పెద్దయెత్తున ట్రాఫిక్ స్థంభించిపోయింది. సోమవారం కూడా పాఠశాలలకు కొన్ని జిల్లాల్లో సెలవులు ప్రకటిచంారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపైకి కూడా నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులుపడుతున్నాు. మణుగూరులో థర్మల్ విద్యుత్తు కేంద్రంలోకి నీరు చేరింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.


Tags:    

Similar News