Rain Alert : ఆంధ్రప్రదేశ్ కు మూడు రోజులు భారీ వర్షాలు...ఈ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు నేడు కురవనున్నాయి. వాతావరణ శాఖ అధికారుల ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు.

Update: 2024-12-25 04:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు నేడు కురవనున్నాయి. వాతావరణ శాఖ అధికారుల ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు. మూడు రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన ఉంటుందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేడు బలహీన పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇరవై నాలుగు గంటల్లో ఇది బలహీనపడుతుందని అంటున్నారు. ఈ ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి దిశగా కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది.

రెండు జిల్లాలకు అలెర్ట్...
ఈ ప్రభావంతో్ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలపింది. నేటి నుంచి శుక్రవారం వరకూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈరోజు భారీ వర్షాల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు చలితీవ్రత కూడా మరింత పెరుగుతందని, ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని తెలిపింది. అలాగే భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు అలెర్ట్ గా ఉండాలని, నదులు, వాగులవద్ద ప్రయాణాలు, రాకపోకలు సాగించడంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
బలమైన గాలులతో కూడిన...
మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని కూడాసూచించింది. ఇప్పటికే ఏపీలోని అన్ని పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. ఇప్పటికే కోస్తాంధ్ర ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఐదు మీటర్ల ఎత్తున సముద్రంలో అలలు ఎగిసిపడుతుండటంతో పర్యాటకులు కూడా బీచ్ ల వద్దకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. పర్యాటకులు సముద్రంలోపలికి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News