రేషన్ డీలర్ షిప్ ల రద్దుపై హైకోర్టు కీలక తీర్పు
హైకోర్టు లో రేషన్ డీలర్ షాపుల రద్దుపై కీలక తీర్పు చెప్పింది;

హైకోర్టు లో రేషన్ డీలర్ షాపుల రద్దుపై కీలక తీర్పు చెప్పింది. రేషన్ షాప్ డీలర్ షిప్ లను ఏకపక్షంగా రద్దు చేయడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. డీలర్ షిప్ ల రద్దు వల్ల డీలర్ల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం మారినంత మాత్రాన రేషన్ డీలర్లను తొలగంచాలన్ననిబంధన ఏమీ లేదనితెలిపింది.
ఆరోపణలు వస్తే...
రేషన్ డీలర్లపై ఆరోపణలు వస్తే తగిన విచారణ చేశాకే రద్దు విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగిపై ఆరోపణలు వస్తే ఏ విధమైన విచారణ చేస్తారో, డీలర్‌షిప్‌లపై ఆరోపణల విషయంలో కూడా విచారణ జరగాని హైకోర్టు అభిప్రాయపడింది. డీలర్ల తరుపున కూడా వాదనలు వినాలని, డీలర్‌తో పాటు ఒకవేళ సాక్షులు ఉంటే వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని హైకోర్టు తెలపింది.