Perni Nani : నేడు పేర్ని నాని పిటీషన్ పై విచారణ
మాజీ మంత్రి పేర్నినాని క్వాష్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరుగుతుంది.;

మాజీ మంత్రి పేర్నినాని క్వాష్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరుగుతుంది. రేషన్ బియ్యం మాయం అయిన కేసులో పేర్నినానితో పాటు ఆయన భార్య జయప్రద, కుమారుడు కృష్ణమూర్తిలపై కేసులు నమోదు చేశారు. మచిలీపట్నం పోలీసులకు విచారణకు రమ్మని పిలిచినా పేర్ని నాని రాలేదు. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో విచారణకు రావాలని నోటీసులు కూడా ఇచ్చారు.

కేసులను కొట్టివేయాలంటూ...
ఈ నేపథ్యంలోనే పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి తనపై నమోదయిన కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై నేడు విచారణ జరుగుతుంది. మరొక వైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు పేర్ని నాని అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన రేషన్ బియ్యం మాయం కేసులో ప్రధాన నిందితుడని ఆరోపిస్తున్నారు.