ఇంటర్ విద్యార్థులకు ఫీజు గడువు ఎప్పటి వరకూ అంటే?

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది;

Update: 2024-10-18 07:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు కోసం ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు ఫీజు చెల్లించవచ్చని విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. అలాగే వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో నవంబర్ ఇరవై తేదీ లోగా చెల్లించవచ్చని తెలిపింది.

నో ఛాన్స్...
ఈ గడువు తర్వాత ఇక ఫీజు చెల్లింపునకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అలాగే ఇంటర్ ప్రయివేటుగా రాసేవారు పది హేను వందల రూపాయలు వచ్చే నెల 30వ తేదీలోగా చెల్లించాలని పేర్కొంది. ఐదు వందల పెనాల్టీతో నవంబర్ 30లోగా ఫీజు చెల్లించవచ్చని విద్యామండలి జారీచేసిన ప్రకటనలో తెలిపింది.
Tags:    

Similar News