నిందితులను కఠినంగా శిక్షించాలి : ఏపీ హోం మంత్రి తానేటి వనిత

ఎట్టి పరిస్థితుల్లో నిందితులను వదిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు..

Update: 2022-05-06 09:27 GMT

రాజమండ్రి : నిన్న రాత్రి అనకాపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. అక్కాచెల్లెల్లు బహిర్భూమికి వెళ్లిన సమయంలో పక్కింట్లో ఉండే సాయి అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత తీవ్రంగా స్పందించారు. రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే బాధగా ఉందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అనకాపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలో బీ ఫార్మసీ విద్యార్థిని తేజశ్విని ఘటనలపై హోమంత్రి ఆరా తీశారు. ఆరు బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్నట్లు అనకాపల్లి ఎస్పీ హోంమంత్రి కి వివరించారు.

బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని హోమంత్రి వనిత వైద్యులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులను వదిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా హోమంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా తేజశ్విని సంఘటనలో నిందితుడు సాదిక్ ను వెంటనే అరెస్ట్ చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ హోం మంత్రికి తెలిపారు. తేజస్విని తల్లిదండ్రుల కోరినట్లు రీ పోస్ట్ మాట్రం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వనిత హెచ్చరించారు. ఇలాంటి ఘటనపు పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసులు నిందితుపై చర్యలు మరింత కఠినతరం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులకు ఈ సందర్భంగా ఆమె సూచించారు.


Tags:    

Similar News