జీవీరెడ్డిపై ఐఏఎస్ అధికారుల ఆగ్రహం... నేడు సీఎంకు ఫిర్యాదు
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీరెడ్డిపై ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయనున్నారు;

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీరెడ్డిపై ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవల జీవీరెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఐఏఎస్ లపై చేసిన వ్యాఖ్యలు కించపర్చే విధంగా ఉన్నాయని, రాజద్రోహం వంటి ఆరోపణలు చేయడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. ఆధారాలు లేకుండా ఐఏఎస్ లపై ఇలాంటి పరుష పదజాలం ప్రయోగించడాన్ని ఐఏఎస్ అధికారులు తప్పుపడుతున్నారు.
ఫైబర్ నెట్ లో ...
ఫైబర్ నెట్ లో కొందరు అధికారుల తీరు వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని, ఇది రాజద్రోహమేనని జీవీ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు అధికారులను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. సీఐడీ దర్యాప్తునకు కోరతానని కూడా జీవీ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వివాదం ముదరడంతో నిన్నమంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అధికారులతో చర్చలు జరిపారు. ఫైబర్ నెట్ పై నివేదిక ఇవ్వాలని కోరారు. ఈరోజు మధ్యాహ్నం ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలసి జీవీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనుంది.