Andhra Pradesh : వామ్మో ఇంత మంది అనర్హులా? ఇంతకాలం పింఛను అందుకుంటున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో పింఛను దారులు గతకొద్దిరోజుల నుంచి అక్రమంగాపొందుతున్నారని తేలింది.

Update: 2024-12-12 08:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో పింఛను దారులు గతకొద్దిరోజుల నుంచి అక్రమంగాపొందుతున్నారని తేలింది. ఈ విషయాన్ని ప్రభుత్వమే తెలిపింది. ప్రతి పదివేల మందిలో ఐదు వందల మంది అనర్హులేనని తేల్చారు. ఈ విషయాన్ని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. తాము ఇటీవల నిర్వహించిన సర్వేలో అనర్హులకు పింఛన్లు అందుతున్నట్లు తేలిందన్నారు. గత ప్రభుత్వ హాయాంలో ఆరు లక్షల మంది వరకూ హడావిడిగా పెన్షన్లు ఇచ్చారని, ఇందులో ఎక్కువ మంది అనర్హులేనని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అనర్హులని తేలిన వారి నుంచి ఇన్నాళ్లు పొందిన పింఛను మొత్తాన్ని రికవరీచేయాలని ఆదేశించారు.



మూడు నెలల్లో...

దీంతో చంద్రబాబు ఇక మూడునెలల్లో ప్రతి పెన్షన్ ను కలెక్టర్లు పరిశీలించాలని కోరారు. అలాగే దివ్యాంగుల విషయంలో కూడా అనర్హులు లబ్ది పొందుతున్నారని సర్వేలో వెల్లడయిందని అధికారులు తెలిపారు. దివ్యాంగుల విషయంలో కూడా అనర్హులను తొలగించాలని చంద్రబాబు జిల్లా కలెక్టర్లను కోరారు. ప్రజల సొమ్మును అర్హులైన లబ్దిదారులకే అందచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టి మూడు నెలల్లో పింఛన్లఏరివేత కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

 


Tags:    

Similar News