YSRCP : నేడు వైసీపీ విద్యుత్తు ఛార్జీలపై ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతుంది

Update: 2024-12-27 02:08 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతుంది. పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించనుంది. ఈ మేరకు విద్యుత్తు అధికారులకు వినతి పత్రాలను వైసీపీ నేతలు ఎక్కడికక్కడ అందించనున్నారు. ప్రజలపై 15,485 కోట్ల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఈ ఆందోళనలకు దిగింది.

జగన్ పిలుపు మేరకు...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు నేడు ధర్నాలు చేసి విద్యుత్తు శాఖ అధికారులకు పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వినతి పత్రాలను అందచేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో భారీగా కార్యకర్తలను సమీకరించి ఆందోళనలకు పిలుపు నివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల నేతలను ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 



 


Tags:    

Similar News