Tirupathi Stampade : బాబు భలే మేనేజ్ చేస్తాడయ్యా.. సోషల్ మీడియాలో సెటైర్లు

చంద్రబాబు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఒక దుర్ఘటనను ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు.;

Update: 2025-01-09 12:14 GMT

చంద్రబాబు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఒక దుర్ఘటనను ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఎందుకంటే దుర్ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు మనం చూశాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు దగ్గర నుంచి జేఈవో వరకూ ఆయన దుమ్ముదులిపినట్లు టీవీల్లో మోతమోగిపోగింది. నిజానికి దుర్ఘటన జరగడం దురదృష్టకరమే అయినా అప్పటికప్పుడు ఆయన ప్రజల దృష్టిని మరల్చడానికి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఎప్పుడూ ఇంతే. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇక ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం కూడా ఒకింత తగ్గుతుంది. ఇది ఒకరకం టెక్నిక్. ఇక రేపటికి ఈ విషయాన్ని మర్చిపోతారు. జరిగిన దుర్ఘటన కన్నా అధికారులను చంద్రబాబు తిట్టిందే హైలెట్ అవుతుంది. హోంశాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఈ రకమైన కొత్త టెక్నిక్ ను ఆయన అవలంబిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇందుకు ఇదో ఉదాహరణ...
ఇందుకు నేను ఒక ఉదాహరణ చెబుతా. 1990వ దశకంలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండేవారు. పేరు, నియోజకవర్గం ఎందుకు కానీ ఆయన ఇదే టెక్నిక్ వాడేవారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడంలో ఆయన దిట్ట. ఎలా అంటే.. నేనే అనేక సార్లు ప్రత్యక్ష సాక్షిని. ఆరోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు. కేవలం ల్యాండ్ ఫోన్లు. ఎమ్మెల్యే గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో మమేకమయ్యే వారు. వెంటనే వారి సమస్యలపై ల్యాండ్ ఫోన్ నుంచి అధికారికి ఫోన్ చేసి బూతులు తిట్టేవారు ఎమ్మెల్యే. ఒకరోజు నేను అక్కడే ఉండగా ఒక రైతు వచ్చి అన్నా నా పొలంలో కరెంట్ కనెక్షన్ పీకేశాడు. అని చెప్పడంతో మరోమాట్లాడకకుండా.. ఎవడ్రా మన పొలంలో కరెంట్ కట్ చేసేది. అంటూ ఆ ఎమ్మెల్యే విద్యుత్తుశాఖ అధికారిని తెగ తిట్టాడు. దీంతో వాడు తన కరెంట్ కనెక్షన్ పీకాడన్న అసలు విషయం మరిచి ఎమ్మెల్యే తన పొలానికి కరెంట్ ను కట్ చేసిన అధికారిని ఎమ్మెల్యే తిట్టినందుకు ఆనందపడి వెళ్లిపోయాడు. నిజానికి ఫోన్ మాట్లేడేముందే ఆ ప్లగ్ ను పీకేసి అధకారితో మాట్లాడుతున్నట్లు ఎమ్మెల్యే అలా మాట్లాడే వాడు. అంటే అవతల ఫోన్ లో ఎవరూ ఉండేవారు కాదు. కానీ వచ్చిన వ్యక్తికి మాత్రం అధికారిని తిట్టారన్న సంతోషంతో తన కరెంట్ కొంత కాలం రాకపోయినా ఎమ్మెల్యేను మాత్రం మెచ్చుకునే వారు. ఇందులో చంద్రబాబు తప్పులేదు. వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లకు సంబంధించి పాలకవర్గానిదే బాధ్యత. ఆపైన అధికారులది కూడా. కానీ చంద్రబాబు అధికారులపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం అసలు 
సరైన మార్గదర్శనం
ఇలాగా చంద్రబాబు కూడా ఈ టెక్నిక్ ను ఉపయోగిస్తున్నట్లుంది. వైకుంఠ ఏకాదశికి టిక్కెట్లు 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తున్న విషయం అక్కడి ప్రజాప్రతినిధుల నుంచి టీటీడీ బోర్డు సభ్యుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు చివరకు చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ దుర్ఘటన జరగడానికి ప్రధాన కారణం తక్కువ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన టీటీడీ పాలకమండలిదే కావచ్చు. అందులోనూ తిరుపతి ఘటన జరిగింది పోలీసుల వైఫల్యమేనని అందరూ చెబుతున్నదే. చివరకు కలెక్టర్ కూడా అదే విషయం చెప్పారు. కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేనిది టీటీడీ పాలకమండలి. పింఛను పంచడానికి ప్రతి నెల ఒకటో తేదీ ఇళ్ల ముందు వాలిపోతున్న ప్రజాప్రతినిధులు.. ఇలాంటి అతిపెద్ద ఘటనను చిన్నది చేసి చూపటానికి చంద్రబాబు చేసిన ప్రయత్నంగానే చూడాలి. ఎందుకంటే రాజకీయ నేతలు సరైన మార్గదర్శనం కూడా ఇవ్వలేదు. అంటే టీటీడీ పాలక మండలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చెందలేదు.
సమస్యనుచిన్నదిగా చూపించేందుకు...
కేవలం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఘటనకు బాధ్యులైన వారిని మాత్రం బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వినపడుతున్నాయి. చంద్రబాబు ఇలాంటి టెక్నిక్ తోనే అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కమ్మునిస్టు పార్టీలు, వైసీపీ వంటివి ఆరోపించారు. ఘటన జరిగిన తర్వాత వరసగా మంత్రులను పంపడం, చివరకు అందరూ వచ్చి తిరుపతిలో వాలిపోవడం కూడా ఈ ఘటనను చిన్నది చేయడానికేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు నిన్న ప్రధాని మోదీ పాల్గొన్న విశాఖ సభ సక్సెస్ అయిన ఆనందం ఎక్కువ సేపు నిలవకుండా తిరుపతి ఘటనను ఇలా చేశారన్న బాధ ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంది. అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా బాధ్యులను చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షలు చంద్రబాబు చేస్తున్నారు. అదేదో ముందే మంత్రులు చేసి ఉంటే ఇంతటి తప్పిదం జరిగి ఉండేది కాదుకదా? అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.


Tags:    

Similar News