లంబసింగిలో లో సింగిల్ పాయింట్
లంబసింగిలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఒక డిగ్రీకి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
లంబసింగిలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఒక డిగ్రీకి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు, పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. లంబసింగి పర్యాటక ప్రాంతం కావడంతో ఎక్కువ మంది పర్యాటకులు చేరుకుంటున్నారు. ఒక డిగ్రీకి ఉష్ణోగ్రతలు పడి పోవడంతో బయటకు వచ్చేందుకు కూడా భయపడిపోతున్నారు.
ఇక్కడ రెండు డిగ్రీలు...
అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో రెండు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి ఉండటంతో ప్రజలు గజగజ వణికి పోతుున్నారు. సూర్యుడు ఉదయం పది గంటల వరకూ కన్పించకపోవడంతో అప్పటి వరకూ బయటకు రావడం లేదు. చలి మంటలు వేసుకుని కొందరు తమను తాము రక్షించుకుంటున్నారు