Pawan Kalyan : వైఎస్ షర్మిలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్... ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తాను తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తాను తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీతో పొత్తును తాను వ్యూహం ప్రకారమే కుదుర్చుకున్నానని తెలిపారు. ఎవరూ అసంతృప్తికి గురి కావద్దన్నారు. టీడీపీ - జనసేన ప్రభుత్వం ఏర్పడితేనే శాంతి - సుస్థిరత ఏర్పడుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. 2024 తర్వాత దేశంలోనే అత్యున్నత స్థానానికి తీసుకెళ్లే బాధ్యత అందరం తీసుకుందామని చెప్పారు. ప్రతి ఒక్కరినీ తాను గుర్తిస్తానని తెలిపారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఏమీ చేయలేకపోయారన్నారు. మన్నలి విమర్శించే అర్హత ఎవరికీలేదన్నారు. ఇక్కడ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ లు కలసి పనిచేయాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు.
రోజుకు అరశాతమైనా...
ప్రతి రోజూ జనసేన, టీడీపీ కలసి కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చి వైసీపీకి ఒక అరశాతం ఓట్లు అయినా తగ్గించేలా పాటు పడాలన్నారు. తనకు ఒక ప్రణాళిక ఉందన్నారు. ప్రధానంగా ఓటర్ల జాబితాలో తొలగించిన ఓట్లపై యుద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. ఎవరూ ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు. తాను అండగా ఉంటానని చెప్పారు. తెలగాణలో బీజేపీ - జనసేన పార్టీలు కలసి పనిచేశాయన్నారు. ఎణన్నిలకు ఇంకా వంద రోజుల సమయం ఉందని, ఆరున్నర లక్షల మంది క్యాడర్ రోడ్డు మీదకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో యాభై శాతం కూడా ఓటింగ్ నమోదు కాకపోవడం తనను బాధించిందన్నారు. యువత ఓటు వేసేలా అందరూ కృషి చేయాలన్నారు.