ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం కోసం జనసేనాని ధర్మయాగం
సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలతో.. ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ.. ప్రకృతి విపత్తుల నివారణ
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 14 నుండి ఏపీలో వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మంగళగిరి జనసేన కార్యాలయంలో ధర్మయాగం నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలతో.. ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ.. ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు. ఉదయం 6 గంటల 55 నిమిషాలకు యాగశాలలో దీక్ష చేపట్టారు. యాగశాలలో ఐదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపన చేశారు. వారికి అభిముఖంగా యంత్రస్థాపన చేశారు.
సోమవారం ఉదయం విగ్రహం.. యంత్రం.. హోమం ఆలంబనగా ప్రారంభమైన యాగం.. రేపు కూడా కొనసాగుతుంది. వారాహి పొలిటికల్ యాత్ర సక్సెస్ కావాలంటూ జనసేన నేతలు విజయవాడ దుర్గగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 14 నుండి మొదలయ్యే యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని కోరుతూ 108 కొబ్బరికాయలు కొట్టారు. కాగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సెక్షన్ 30 యాక్ట్ సాధారణ విధుల్లో భాగమేనని జిల్లా ఎస్పీ క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సభ జరిగే ప్రాంతాన్ని..జనసేన నేతలతో కలిసి అమలాపురం డీఎస్పీ పరిశీలించారు.