ప్లేస్ ఫిక్స్.. జనసేనాని మళ్లీ జనం లోకి..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి విజయయాత్రకు సిద్ధమయ్యారు.

Update: 2023-08-03 10:50 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి విజయయాత్రకు సిద్ధమయ్యారు. మెుదటి రెండు విడతలు ఉభయగోదావరి జిల్లాలలో చేపట్టారు. మూడో విడత వారాహి విజయయాత్రను విశాఖపట్నంలో చేపట్టనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నగరం నుంచి మొదలవుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రలో భాగంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడో విడత యాత్రకు సన్నాహకాలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఎవరిని పవన్ టార్గెట్ చేస్తారోనన్న ప్రశ్నలు ఉత్తరాంధ్రలో పెద్ద చర్చ జరుగుతుంది.

వారాహి మూడో విడత యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగింది. అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలని అన్నారు. నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల లోకి తీసుకువెళ్లాలని అన్నారు.


Tags:    

Similar News