వైసీపీ గూండాలను ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ కొడతాం: పవన్ కళ్యాణ్

వైసీపీ గూండాలను ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ కొడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా

Update: 2023-06-26 02:09 GMT

వైసీపీ గూండాలను ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ కొడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగించారు. తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ అక్కర్లేదని తన ఒంటిపై రాయిపడితే తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. పాతిక సంవత్సరాల యుద్ధానికి సిద్ధపడి తనతో గొడవ పడాలన్నారు. వైసీపీ నేతలు వివిధ ప్రాంతాల నుంచి క్రిమినల్స్‌ను తీసుకొచ్చుకుంటున్నారని.. రోడ్డు మీద ఎలా తిరుగుతావో చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రౌడీలకు భయపడే రకం కాదు.. విప్లవకారుడినని అన్నారు. మీరు రౌడీలను చూసి వుంటారు కానీ, విప్లవ పంథాలో వున్న రాజకీయ నాయకుడిని చూసి వుండరని అన్నారు. అంతర్వేదిలో రథం కాలిపోతే పిచ్చోడు చేశాడని అన్నారని చెప్పారు. ఏపీలోనే అంతర్వేది పెద్ద రథమని దానిని వైసీపీ క్రిమినల్స్ కాల్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలపై 219 ఘటనలు జరిగితే ఒక్కరిని అరెస్టు చేయలేదని.. క్రిమినల్స్‌ను వదిలేస్తే మహిళల మానప్రాణాలకు రక్షణ ఎక్కడా అని పవన్‌ ప్రశ్నించారు. జనసేనకు అండగా నిలబడితే క్రిమినల్స్ ఆట కట్టిస్తామన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి చిక్కుకుపోయిన వారిని తిరిగి రప్పించడానికి చట్టాలు ఉన్నాయన్నారు. ఈ చట్టాలను ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాను గెలిస్తే అసెంబ్లీకి వెళ్ళి చట్టాలు అమలు చేయిస్తామన్నారు.

ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఆందోళన చేస్తున్న దళితులకు తన మద్దతు ప్రకటించారు. ప్రధానమంత్రి దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లే వ్యక్తిని తానంటూ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌పై ద్వేషం లేదని అన్నారు జనసేనాని. బెదిరింపులకు దిగితే విప్లపకారుడైన నాయకుడిని అవుతానన్నారు. సినిమా టికెట్లు విషయాన్ని ఎందుకు మా వద్దకు తీసుకురాలేదని కేంద్ర హోం మంత్రి అడిగారని.. అది నా సమస్య నేనే తేల్చుకుంటానని చెప్పానన్నారు. గోదావరి జిల్లాల్లో వైసీపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా చూస్తామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించని వారు గెలవకూడదన్నారు.


Tags:    

Similar News