వారాహి యాత్రలో అపశృతి

పవన్ కల్యాణ్ ను చూసేందురు భారీసంఖ్యలో జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ యువకుడు

Update: 2023-06-14 13:47 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహియాత్రలో తొలిరోజే అపశృతి చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా కత్తిపూడి సభావేదిక వద్ద జరిగిన ప్రమాదంలో జనసైనికుడు ప్రాణం కోల్పోయాడు. పవన్ కల్యాణ్ ను చూసేందురు భారీసంఖ్యలో జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ యువకుడు పవన్ ను చూసేందుకు లైట్ స్టాండ్ ఎక్కాడు. దానిపై పట్టుతప్పడంతో ట్రాన్స్ ఫార్మర్ పై పడ్డాడు. విద్యుత్ షాక్ తో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఆ యువకుడి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారాహి ప్రచార యాత్ర తొలిరోజే ఇలా అపశృతి జరగడంతో జనసేనులు ఆందోళన చెందుతున్నారు. జనసైనికుడి మృతితో అప్రమత్తమైన నేతలు.. ఎవరూ కరెంట్ స్తంభాలు ఎక్కవద్దని సూచించారు. పవన్ ను కనిపించినంత మేర చూస్తే చాలని, కోరి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని కోరారు.


Tags:    

Similar News