నేడు అన్నవరానికి పవన్..
నసీమ జిల్లాలోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అంతేకాదు రేపటి నుంచి ఉమ్మడి..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రేపటి నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అన్నవరంకు నేడు చేరుకోనున్నారు. వారాహి యాత్రకు అన్నవరం నుంచే అంకురార్పణ చేయనున్నారు. నేటి రాత్రికి పవన్ కల్యాణ్ రత్నగిరి కొండపై బస చేయనున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రేపు ఉదయం సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం కత్తిపూడిలో జరగనున్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు.
నిన్న మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ ధర్మయాగం ప్రారంభించారు. సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలతో.. ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ.. ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు. మరోవైపు.. కోనసీమ జిల్లాలోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అంతేకాదు రేపటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభం కానున్న పవన్ వారాహి యాత్రకు పోలీసులు అభ్యంతరాలు లేవనెత్తారు. పవన్ వారాహి యాత్ర.. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వివరాలు ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో జనసేన నేతలు పవన్ పర్యటన విషయంపై హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.