తాడిపత్రిలో జేసీ నిరసన

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. తన కుమారుడి పై దాడిని వ్యతిరేకిస్తూ ఆయన నిరసనకు దిగారు.

Update: 2022-11-24 12:48 GMT

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి పై దాడిని వ్యతిరేకిస్తూ ఆయన నిరసనకు దిగారు. గాజులపాలెం వీధిలో నిన్న తాడిపత్రి నియోజకవర్గం ఇన్‌ఛార్జి జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ నేతలు రాళ్ల దాడి చేసినట్లు ఆయన ఆరోపించారు. అస్మిత్ రెడ్డి మున్సిపల్ వార్డుల్లో పర్యటిస్తుండగా వీధి లైట్లు ఆపి ఈ రాళ్ల దాడి చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

చర్యలు తీసుకోవాలంటూ....
దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లబాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు వైసీపీ నేతలను రక్షించే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశారు. పెద్దయెత్తున జేసీ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News