నేడు కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక
నేడు కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. వైసీపీ ఎంపీటీసీలను ఇప్పటికే ఆ పార్టీ క్యాంప్ నకు తరలించింది;

నేడు కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. వైసీపీ ఎంపీటీసీలను ఇప్పటికే ఆ పార్టీ క్యాంప్ నకు తరలించింది. ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు ఉన్నాయని, కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలన్న పిటీషన్ ను హైకోర్టు కొట్టి వేయడంతో ఈరోజు ఎన్నిక జరగడం అనివార్యమయింది. అయితే కడప జిల్లాలో అధిక స్థానాలు వైసీపీ గత ఎన్నికల్లో గెలుచుకుంది.
టీడీపీకి తక్కువ మందే...
వారిలో తక్కువ మంది కూటమి వైపు మొగ్గు చూపినా జడ్పీ ఛైర్మన్ గెలుచుకునేంత బలం మాత్రం టీడీపీకి లేదు. అందుకే పోటీ కూడా చేసే అవకాశం లేదు. దీంతో వైసీపీ తన అభ్యర్థిని ఇప్పటిక ప్రకటించడంతో పాటు ఎంపీటీసీలను క్యాంప్ లకు తరలించింది. అయితే ఎన్నిక జరుగుతున్న ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.