Breaking : మచిలీపట్నం బియ్యం కేసులో కీలక పరిణామం

మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నాని కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది

Update: 2024-12-29 07:58 GMT

మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నాని కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోదాము మేనేజర్ మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మానస తేజ బియ్యం మాయమైన కేసులో ఏ2 నిందితుడిగా ఉన్నారు. మానస తేజ కొద్ది రోజుల నుంచి పరారీలో ఉండటంతో మూడు బృందాలు అతని కోసం కొన్ని రోజుల నుంచి గాలిస్తున్నారు.

ఏ2 నిందితుడిగా...
మచిలీపట్నంలో పేర్నినాని సతీమణి జయసుధ పేరిట ఉన్న గోదాములో కొన్ని వేల టన్నుల బియ్యం మాయమైన విషయంలో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పేర్నిజయసుధ ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టు విచారణ రేపు చేయనున్న నేపథ్యంలో మానస తేజఅరెస్ట్ తో కీలక మలుపు తిరిగే అవకాశముంది.


Tags:    

Similar News