చిరుత దాడి.. ఒకరికి గాయాలు.. కలకలమేగా?
చిరుత పులులు గ్రామాల్లోకి వచ్చి కలవర పెడుతున్నాయి. నల్లమల ప్రాంతంలో ఒకరిపై దాడి చేసి గాయపర్చింది
చిరుత పులులు గ్రామాల్లోకి వచ్చి కలవర పెడుతున్నాయి. సాధారణంగా ఎండాకాలం తాగునీరు, ఆహారం కోసం అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి చిరుత పులులు వస్తాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆహారం కోసం గ్రామాల మీదకు వచ్చి పశువులు, మేకలపై దాడులు చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అటవీ ప్రాంత సమీపంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
నల్లమల ప్రాంతంలో...
తాజాగా నల్లమల అటవీ ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. గిద్దలూరు ఘాట్ రోడ్డులోని పచర్ల వద్ద చిరుత సంచారం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. గిద్దలూరు ఘాట్ రోడ్డులోని పచర్ల వద్ద చిరుత ఒక వ్యక్తిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పచర్ల గ్రామంలో నిద్రపోతున్న షేక్ బీబీపై దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. అయితే చిరుతపులిని గుర్తించిన స్థానికులు వెంటనే తేరుకుని పెద్దగా అరుస్తూ కర్రలతో కొట్టడంతో చిరుత పరారయింది. దీంతో చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రెండు బోన్లను ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.