Visakha : బొకారో ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు.. దూకేసిన ప్రయాణికులు

విశాఖ రైల్వే స్టేషన్ లో పెద్ద ప్రమాదం తప్పింది. బొకారో ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.;

Update: 2024-01-07 13:00 GMT
Visakha : బొకారో ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు.. దూకేసిన ప్రయాణికులు

major accident averted in visakha railway station

  • whatsapp icon

విశాఖ రైల్వే స్టేషన్ లో పెద్ద ప్రమాదం తప్పింది. బొకారో ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. భయపడి రైలులో నుంచి ప్రయాణికులు దూకేశారు. సింహాచల రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే బొకారో ఎక్స్ ప్రెస్ రైలు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయపడి ఆందోళనకు గురయి పెద్దయెత్తున హాహాకారాలు చేశారు.

సింహాచలం స్టేషన్ వద్ద...
రైలు నుంచి దూకిన కొందరికి గాయాలయ్యాయి. అయితే వెంటనే రైలు ఇంజిన్ లో వస్తున్న మంటలను సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం బొకారో ఎక్స్ ప్రెస్ రైలును విశాఖపట్నం స్టేషన్ కు తీసుకు వచ్చారు. ఇంజిన్ లో మంటలు రావడంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Tags:    

Similar News