ఆ రోడ్ల మీద తిరిగితే జేబులో డబ్బులన్నీ హుష్

విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారిపై టోల్ ప్లాజా నిర్వాహకులు దోపిడీకి దిగారు

Update: 2024-12-18 07:01 GMT

విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారిపై టోల్ ప్లాజా నిర్వాహకులు దోపిడీకి దిగారు. ఎన్నిసార్లు ప్రయాణించినా అన్ని సార్లు టోల్ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయవాడ దాటిన తర్వాత కాజా వద్ద ఉన్న టోల్‌ప్లాజా లో వాహనదారులు ఒకరోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే, అన్నిసార్లూ టోల్‌ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఆంధప్రదేశ్ లోని అరవై ఐదు టోల్‌ ప్లాజాల్లో నూ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ టోల్ ప్లాజాలకు సంబంధించిన బీవోటీ గడువు ముగియడంతో అక్టోబరు నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్‌ వసూళ్లు జరుగుతున్నాయి.



ఎన్నిసార్లు తిరిగితే అన్ని సార్లు...

సెప్టెంబరు నెల వరకు ఒకసారి వెళితే కారుకు160 రూపాయలు, తిరుగు ప్రయాణంలో ఎనభై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. 24 గంటల్లో ఎన్ని సార్లు తిరిగినా టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ అక్టోబరు నుంచి అమలులోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ ఒకవైపు పూర్తి ఫీజు, రెండోసారి సగం ఫీజు చొప్పున టోల్ పీజు వసూలు చేస్తున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య నిత్యం వందలమంది వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వారిపై టోల్ భారం పడుతుంది. దీంతో ఈ రహదారిపై ప్రయాణంతో జేబులుకు చిల్లుపడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now




Tags:    

Similar News