YSRCP : వైసీపీలో పదవులు భర్తీ చేసిన జగన్

వైసీపీలో పలు పదవులు భర్తీ అయ్యాయి. పలు నియామకాలను ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టారు;

Update: 2025-04-13 02:54 GMT
ys jagan,  ysrcp,  appointments, party posts
  • whatsapp icon

వైసీపీలో పలు పదవులు భర్తీ అయ్యాయి. పలు నియామకాలను ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పునర్ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పీఏసీ మెంబర్లను కూడా జగన్ ప్రకటించారు. సమన్వయకర్తలుగా పలువురిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు జగన్. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించారు. ప

పీఏససీ మెంబర్లుగా...
అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ నియమితులయ్యారు. కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్‌, క్రమశిక్షణా కమిటీ సభ్యుడిగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి నియమితులయ్యారు. వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించారు. 33 మంది నేతలను పీఏసీ మెంబర్లుగా పార్టీ నియమించింది. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, పీఏసీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.


Tags:    

Similar News