నేడు మంత్రి వర్గ ఉప సంఘం భేటీ.. కీలక నిర్ణయాలు
నేడు మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం జరగనుంది.సీఆర్గీఏ భూ కేటాయింపులపై చర్చించనుంది;

నేడు మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం జరగనుంది. సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు మంత్రివర్గ ఉపసంఘం జరగనుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమై పలు అంశాలపై చర్చించనుంది. కీలక నిర్ణయాలను తీసుకోనుంది. ప్రధానంగా అమరావతిరైల్వే లైన్ భూసేకరణకు సంబంధించి ఈ మంత్రి వర్గ ఉప సంఘం చర్చించనుంది.
భూకేటాయింపులపై...
ప్రధానంగా సీఆర్డీఏ భూ కేటాయింపుల కోసం ఈ మంత్రి వర్గ ఉప సంఘం చర్చించనుందని చెబుతున్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగానే త్వరగా భవనాలకు టెండర్లు పిలవడం, భూ కేటాయింపులపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ సమావేశానికి మంత్రులు కొల్లు రవీంద్ర, టీజీ భరత్, సంధ్యారాణి, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్ పాల్గొననున్నారు.