Rain Alert : మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలే.. భయపెడుతున్నారుగా

ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.;

Update: 2025-01-15 03:33 GMT

ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రనప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఉత్తర కోస్తా ప్రాంతంలో మోస్తరు వర్షాలు పడతాయని, రాయలసీమలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది.

ఈదురుగాలులు...
దీంతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశముందని పశువుల కాపర్లు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే మత్స్యకారులకు మాత్రం ఎలాంటి హెచ్చరికలు వాతావరణ శాఖ కానీ, ప్రభుత్వం నుంచి కానీ హెచ్చరికలు జారీ కాలేదు. పండగను వర్షం దెబ్బతీస్తుందేమోనన్న ఆందోళన జనాల్లో నెలకొంది.
సముద్రంలో ఉప్పెన...
పొడి వాతావరణంతో చలిగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. చలి నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా సూచించింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని కేంద్రం ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. జనవరి 15 న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని సమాచారం. రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో 0.5 మీ. నుంచి 1 మీటర్ల మేర అలల తాకిడి ఉంటుందని, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరించింది. కేరళ, తమిళనాడుల్లో మత్స్యకారులను చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముందని తెలిపారు.


Tags:    

Similar News