Weather Report : మరో అల్పపీడనం రెడీ.. మళ్లీ వర్షాలు తప్పవా?

తూర్పు అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2024-12-04 04:04 GMT

తూర్పు అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోనూ తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాలలో వర్షం పడే అవకాశముందని అధికారులు తెలిపారు. అయితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

తగ్గిన చలిగాలు తీవ్రత తగ్గినా...
ప్రస్తుతం హైదరాబాద్ లో చలిగాలుల తీవ్రత కొంత తగ్గింది. ఇటీవల తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండంగా మారి ఆ తర్వాత ఫెంగల్ తుపాను గా మారడంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసాయి. తెలంగాణలో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడ్డాయి. తుపాను తీరం దాటిన తర్వాత కురిసిన భారీ వర్షాలకు ఎక్కువ ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలియడంతో ప్రజలు ముఖ్యంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మిగిలిన పంటను కూడా ఈ వర్షం మింగేస్తుందేమోనని భయపడిపోతున్నారు.
ఈరోజు వర్షం పడే ప్రాంతాలు...
ఈరోజు కూడా కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ ప్రాంతాల్లో ఒక మోస్తరు పడే అవకాశముందని చెప్పింది. అలాగే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్ల వర్షం పడే చాన్స్ ఉందని చెబుతున్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే మొన్నటి తుపానుకు కురిసిన భారీ వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News