Ambati Rambabu : రెడ్ బుక్ అంటే బొక్కలో తోసేస్తాం మరి
రెడ్ బుక్ లో పేర్లున్నాయంటూ లోకేష్ బెదిరించడమేంటని మంత్రి అంబటి రాంబాబు అన్నారు
రెడ్ బుక్ లో పేర్లున్నాయంటూ లోకేష్ బెదిరించడమేంటని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో మంత్రి విడదల రజనీ కార్యాలయంపై దాడి దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారని అన్నారు. కుప్పంలో కూరగాయలను ఎగుమతి చేయడానికి విమానాలను తెస్తానని చంద్రబాబు చెబుతున్నాడని, పథ్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపాలిటీని చేసుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీ ప్రకారం పింఛను ను మూడు వేలు పంపిణీ చేస్తున్నామని అంబటి రాంబాబు తెలిపారు. టీడీపీ, జనసేన కేవలం వారి స్వార్థం కోసమే కలయిక తప్ప, ప్రజా శ్రేయస్సు కోసం కాదని అన్నారు.
నాడు చంద్రబాబు పై...
ఏదో చేస్తామని చంద్రబాబు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. దాడులు చేస్తే ఉక్కుపాదంతో అణిచి వేస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎవరినైనా వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. చివరకు లోకేష్ అయినా.. పవన్ కల్యాణ్ పైన అయినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైసీపీ అవినీతికి పాల్పడిందంటూ పవన్ కామెంట్స్ చేస్తున్నారని, అయితే చంద్రబాబు స్క్రిప్ట్ చదవడం మానుకుని, సొంత ఆలోచనలు చెప్పాలని రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా సీబీఐ విచారణ జరపాలని ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశావా? అని పవన్ ను ప్రశ్నించారు.