Parthasaradhi : నాపై బురద కావాలనే చల్లుతున్నారు
తనపై కావాలనే కొందరు బురదచల్లే ప్రయత్నం చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు
తనపై కావాలనే కొందరు బురదచల్లే ప్రయత్నం చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. తాను క్షమాపణలు చెప్పినా అదే పనిగా విమర్శలు చేయడం సరికాదన్నారు. . బీసీ వర్గానికి చెందిన గొప్ప నాయకుడికి తన నియోజకవర్గంలో గౌరవిస్తున్నారాన్న భావంతోనే ఈ కార్యక్రమానికి హాజరయ్యానన్నారు. గౌడకులస్తులు, నేతలు వస్తారని ఊహించాను కానీ ఇలాంటి వివాదాస్పద వ్యక్తులు చొరబడతారని అస్సలు ఊహించలేదని తెలిపారు. పైగా ఎక్కడో దూరంగా ఉన్న పెడన నుంచి వస్తారని, చెప్పా పెట్టకుండా ఎవరినీ అడగ కుండా చొరబడిపోతారని అస్సలు అనుకోలేదని పార్థసారధి అన్నారు.
అక్కడకు వెళ్లిన తర్వాత...
తీరా అక్కడకు వెళ్లిన తర్వాత ఎలా రియాక్ట్ అయినా ఇబ్బంది కరమేనని సైలెంట్గా ఉండాల్సి వచ్చిందని పార్థసారధి చెప్పారు. వాళ్ళని చూసి బయటకు వచ్చేస్తే లచ్చన్న గారిని అగౌరవపరిచి నట్టు అవుతుందని, ఆ వర్గ ప్రజలు అభిమానులు భావిస్తారని అనుకున్నానని, అందుకే ఏం రియాక్ట్ అవలేదని, అసలు మాట్లాడే ప్రయత్నం చేయ లేదని తెలిపారు. కొంచెం దూరం జరిగి ఆ తరువాత బయటకు వచ్చేశానని పార్థసారధి చెప్పారు. పార్టీకి కట్టుబడి మనస్ఫూర్తిగా పని చేస్తున్నా, కావాలనే నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇట్లా చేస్తున్నట్టు అనిపిస్తుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే నేను చాలా మంది నాయకులకు దూరంగా వచ్చేశా. అక్కడ పెద్దగా ఎవరితోనూ తిరిగింది లేదు. సాన్నిహిత్యం లేదని ఆయన పార్థసారధి అన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now