Nara Lokesh : సింహాచలంలో నారా లోకేష్
సింహాచలం ఆలయాన్ని మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు
nara lokesh
సింహాచలం ఆలయాన్ని మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం ఆయన సింహాచలంలో శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఉదయాన్నే ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు...
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం లోకేష్ స్వామివారికి పూజలు నిర్వహించారు. వేదపండితులు లోకేష్ కు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.