ఉండవల్లిలో నేడు శాశ్వత ఇంటి పట్టా పంపిణీ
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఈరోజు రాజధాని అమరావతిలోని ఇళ్ల పట్టాలను పంపిణీచేయనున్నారు;

రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఈరోజు రాజధాని అమరావతిలోని ఇళ్ల పట్టాలను పంపిణీచేయనున్నారు. ఉదయం పది గంటలకు ఉండవల్లి రజకుల కాలనీలోని రాజమండ్రి సీతామహాలక్ష్మి కి తొలి శాశ్వత ఇంటి పట్టా అందజేయనున్నారు. రైతుల నుంచి భూములను తీసుకున్నతర్వాత వారికి ఇప్పటి వరకూ పట్టాలు ఇవ్వలేదు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత....
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని భూములిచ్చిన రైతులకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమర్షియల్ ప్లాట్లు, రెసిడెన్షియల్ ప్లాట్లను ఇవ్వడానికి అంతా సిద్ధం చేసింది. అందులో భాగంగానే తొలి శాశ్వత పట్టాను లబ్దిదారులకు మంత్రి నారా లోకేశ్ అందచేయనున్నారు. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.