Nara Lokesh : అమెరికాలో కొనసాగుతున్న లోకేష్ పర్యటన

అమెరికాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. పెట్టుబడులకోసం ఆయన సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు

Update: 2024-10-28 02:50 GMT

అమెరికాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రాప్ బాక్స్ కో ఫౌండర్ సుజయ్ జస్వా నివాసంలో పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీంతో స్పందించిన కొందరు పారిశ్రామికవేత్తలు స్పందించినట్లు లోకేష్ తెలిపారు. అమరావతి రాజధాని పరిసరాల్లో ప్రభుత్వరంగంలో మూడు బిలియన్ డాలర్లు, ప్రైవేటు రంగంలో 4.5బిలియన్ డాలర్లతో వివిధ నిర్మాణాలు, అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయన్నారు.

స్పందన బాగుంది...
వీటికితోడుగా రాష్ట్రంలోని మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ, మూలపేట ప్రాంతాల్లో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ పోర్టులు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని, ఏడాదిన్నరలో పూర్తికానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా పెద్దఎత్తున ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయని వివరించారు. అమరావతిలో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్న ఆయన రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఎఐ సంస్థలకు అవరమైన మ్యాన్ పవర్ అందుబాటులో ఉంటుందన్నారు. అన్నివిధాలా అనుకూల వాతావరణం కలిగిన ఎపిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశానని ఆయన తెలిపారు. ఇందుకు పారిశ్రామికవేత్తల నుంచి సానుకూల స్పందన వచ్చిందని నారా లోకేష్ తెలిపారు.


Tags:    

Similar News