అసంపూర్తిగా ముగిసిన చర్చలు

ఉద్యోగ సంఘాలతో మంత్రుల సమావేశం ముగిసింది. మంత్రులతో చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి

Update: 2022-09-06 12:44 GMT

ఉద్యోగ సంఘాలతో మంత్రుల సమావేశం ముగిసింది. సీపీఎస్ రద్దుపై మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈచర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. రేపు మరోసారి అధికారికంగా సమావేశం కావాలని నిర్ణయించారు. ఉద్యోగ సంఘాలు ఓపీఎస్ ను అమలు పర్చాలని డిమాండ్ చేశారు. అయితే అది సాధ్యం కాదని మంత్రులు తేల్చి చెప్పారు. ఇప్పటికి జీపీఎస్ ను అంగీకరించాలని ఉద్యోగ సంఘాలను మంత్రులు కోరారు. అందుకు ఉద్యోగ సంఘాలు తాము అందుకు ఒప్పుకోమని మంత్రులకు ఖరాఖండిగా చెప్పారు.

11న మిలియన్ మార్చ్ కు...
ఓపీఎస్ పై చర్చిద్దామంటేనే తాము సమావేశానికి వచ్చామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. సీపీఎస్ లో ప్రభుత్వం వటా ఇంత వరకూ ఇవ్వడం లేదన్నారు. చర్చలకు పిలిచి మళ్లీ మంత్రులు జీపీఎస్ గురించే మాట్లాడుతున్నారన్నారు. దానిపై మాట్లాడితే ఇక అసలు చర్చలకు పిలవవద్దని చెప్పినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని తాము కోరామన్నారు. మరో మిలియన్ మార్చ్ ద్వారా సీపీఎస్ ను తరిమికొట్టాలని భావించామని, సీఎం ఇల్లు ముట్టడి నెపాన్ని చూపి తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా కేసులు పెట్టారన్నారు. సెప్టంబరు 11న పోలీసులు అనుమతిస్తేనే మిలియన్ మార్చ్ ఉంటుందని, లేకుంటే మరోసారి వాయిదా వేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.


Tags:    

Similar News