రామాలయంలో కూలిన ధ్వజస్తంభం..తృటిలో తప్పిన పెనుప్రమాదం
గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో గల రామాలయంలో ధ్వజస్తంభం పునరుద్ధరణకు నేడు ముహూర్తం పెట్టారు. అనుకున్న ముహూర్తానికి..
రామాలయంలో ధ్వజస్తంభం పునరుద్ధరణ కార్యక్రమంలో అపశృతి జరిగింది. గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో గల రామాలయంలో ధ్వజస్తంభం పునరుద్ధరణకు ముహూర్తం పెట్టారు. అనుకున్న ముహూర్తానికి ధ్వజస్తంభారోహణ చేస్తుండగా.. అది కూలిపోయింది. ఆ సమయంలో ధ్వజస్తంభం చుట్టూ భక్తులు గుంపులుగా ఉన్నారు.
Also Read : శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త
వెంటనే ప్రమాదాన్ని గ్రహించి తప్పుకోవడంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. ధ్వజస్తంభానికి ఇరువైపులా తాడులు కట్టి.. రెండు క్రేన్ల సహాయంతో దానిని ఆలయం ఎదుట పునః ప్రతిష్టిస్తుండగా.. ఒక్కసారి రెండు క్రేన్లకు జోడించిన తాడులు తెగిపోయాయి. ధ్వజస్తంభం అమాంతం కిందపడిపోయింది. భక్తులు అప్రమత్తమై పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. స్థానికులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అవుతోంది.