లోకేష్ తో గంటా భేటీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు

Update: 2023-01-10 12:41 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఆయనను లోకేష్ ను కలిసి రాజకీయ పరిణామాలపై చర్చించారు. సంక్రాంతి తర్వాత తాను యాక్టివ్ అవుతానని లోకేష్ కు చెప్పినట్లు తెలిసింది. కరోనా, వ్యక్తిగత కారణాల వల్ల తాను ఇన్నాళ్లూ దూరంగా ఉన్నానని, అందుకు కారణాలివీ అని ఆయన లోకేష్ ముందు ఉంచినట్లు సమాచారం.

నియోజకవర్గం మాత్రం...
తాను ఎందుకు నియోజకవర్గానికి దూరంగా ఉన్నదీ సవివరంగా తెలిపినట్లు తెలిసింది. లోకేష్ కూడా సంక్రాంతి తర్వాత యాక్టివ్ కావాలని లోకేష్ కూడా గంటా శ్రీనివాసరావుకు సూచించినట్లు తెలిసింది. పార్టీ మారతారని ఇన్నాళ్లూ గంటా పై పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అయితే గంటా పార్టీ మారకపోయినా నియోజకవర్గం మారతానని ఈ సందర్భంగా లోకేష్ కు తెలిపినట్లు సమాచారం.


Tags:    

Similar News