పవన్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ ఏమన్నారంటే?

డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు

Update: 2024-11-04 12:44 GMT

డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఎవరైనా ఏ శాఖపైనా తమ అభిప్రాయాలను చెప్పే వీలుందని ఆయన తెలిపారు. వారికి అందుకు పూర్తి అధికారాలున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. అందులో ఎవరినీ తప్పు పట్టడానికి లేదని అన్న నారాయణ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఒక హెచ్చరికగా తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలేమిటో గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం తప్పు కాదని నారాయణ అభిప్రాయపడ్డారు.

రాజధాని నిర్మాణ పనుల్లో...
ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఏమీ చేయలేదపి మంత్రి నారాయణ అన్నారు. అక్టోబర్ 31న రాజధానిపై కీలక నివేదికలు వచ్చాయన్న నారాయణ, పాత టెండర్లను రద్దు చేస్తూ సీఆర్‌డీఏ తీర్మానం కొత్త టెండర్లు పిలవడానికి లైన్ క్లియర్ అయిందని నారాయణ తెలిపారు. మూడేళ్లలో పనులు పూర్తిచేయాలని చంద్రబాబు ఆదేశించారని, డిసెంబర్ 31న కొత్త టెండర్లు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. వరదనీటి నిర్వహణపై నెదర్లాండ్‌సంస్థ నివేదికకు ఆమోదం లభించిందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో వరద నీటి నిర్వహణకు మూడు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.


Tags:    

Similar News