టీచర్ ఎమ్మెల్సీ స్థానం వైసీపీదే

కడప - అనంతపురం - కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎం.వి.రామచంద్రారెడ్డి విజయం సాధించారు

Update: 2023-03-17 03:16 GMT

కడప - అనంతపురం - కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వైసీపీ బలపర్చిన ఎం.వి.రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ఒంటేరు శ్రీనివాసులరెడ్డిపై 169 ఓట్ల తేడాతో ఎం.వి.రామచంద్రారెడ్డి గెలిచారని అధికారులు ప్రకటించారు. కడప - అనంతపురం - కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎం.వి.రామచంద్రారెడ్డి విజయం సాధించారని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అనంతపురం నగరంలోని జేఎన్టీయూ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజాము వరకూ సాగిన కౌంటింగ్ లో చివరకు రామచంద్రారెడ్డినే విజయం వరించింది.

ఎలిమినేషన్ ప్రక్రియలో...
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కకపోవడంతో, ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 169 ఓట్ల తేడాతో ఎం.వి.రామచంద్రారెడ్డి గెలిచినట్లుగా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ప్రకటించారు. ఈ కౌంటింగ్ లో ఒంటేరు శ్రీనివాసులరెడ్డికి 10,618 ఓట్లు రాగా, ఎం.వి.రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు. అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన అనంతరం ఎం.వి.రామచంద్రారెడ్డి గెలుపుని ప్రకటిస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.


Tags:    

Similar News