Nagababu : పిఠాపురం టీడీపీ వర్మపై నాగబాబు సెటైర్లు.. అది మా ఖర్మ అంటూ
జనసేన ఆవిర్భావ సభలో పార్టీ నేత నాగబాబు ప్రసంగించారు. అయితే తన ప్రసంగంలో టీడీజీ మాజీ ఎమ్మెల్యే వర్మపై సెటైర్లు వేశారు;

జనసేన ఆవిర్భావ సభలో పార్టీ నేత నాగబాబు ప్రసంగించారు. అయితే తన ప్రసంగంలో టీడీజీ మాజీ ఎమ్మెల్యే వర్మపై సెటైర్లు వేశారు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో తమను ఇన్ ఛార్జిగా పవన్ నియమించారన్నారు. ఇక్కడి ఎన్నిలను పరిస్థితిని సమీక్షించడానికి వచ్చిన తమకు రెండు విషయాలు అర్థమయ్యాయయని తెలిపారు. ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ గెలుపు ఖాయమయిందని నాగబాబు అన్నారు. తాము కేవలం ఇక్కడ పనిచేస్తున్నామని చెప్పుకోవడానికే వచ్చామని గుర్తించామన్నారు.
రెండు కారణాలు...
పవన్ కల్యాణ్ గెలుపునకు పిఠాపురంలో రెండు కారణాలున్నాయన్న నాగబాబు, అందులో ఒకటి పవన్ కల్యాణ్ కాగా, రెండోది జనసైనికులు అని నాగబాబు అన్నారు. అంతే తప్ప తాము ఆయన విజయానికి ఎంత మాత్రం కారణం కాదని, మరెవ్వరూ కాదని నాగబాబు స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలవడానికి తానే కారణమి ఎవరైనా భావిస్తే అది వారి ఖర్మ అంటూ నాగబాబు సైటైర్ వేశారు. అంటే నాగబాబు వర్మ పేరు ఎత్తకుండా ఆయనపై నాగబాబు సెటైర్ వేసినట్లు కనిపిస్తుంది.