ఈ దరిద్రాన్ని వదిలించుకోవాల్సిందేనన్న లోకేష్

ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు

Update: 2024-02-20 11:51 GMT

ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మూడు రాజధానుల పేరుతో మన జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారు. మాడుగుల శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని తెలిపారు. ఐదేళ్లుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసే బాధ్యత తనదేనని అన్నారు. విశాఖకు పెద్దఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామన్నాకరని తెలిపారు.

ఒక్క గుంతలయినా...
పరిశ్రమలు తీసుకురావడం కాదని, ఉన్నవి కూడా పారిపోయే పరిస్థితి వచ్చిందని, పాలిచ్చే ఆవును వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని లోకేష్ అన్నారు. ముత్యాలనాయుడిని గెలిపిస్తే ఉత్తరాంధ్రకు ఏం చేశారని నారా లోకేష్ ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక్కచోటైనా రోడ్డు వేశారా అంటూ నిలదీశారు. ఒక్క గుంత అయినా పూడ్చారా అని అడిగారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి నిల్.. అవినీతి ఫుల్ అని ఫైర్ అయ్యారు. ఇష్టమొచ్చినట్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు.


Tags:    

Similar News