Nara Lokesh : జగన్ వల్ల ఏపీ సర్వనాశనమయింది : లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో జగన్ గత ప్రభుత్వం ప్రారంభించిన రాజధాని, పోలవరం పనులను నిలిపేశారని నారా లోకేష్ అన్నారు
ఆంధ్రప్రదేశ్ లో జగన్ గత ప్రభుత్వం ప్రారంభించిన రాజధాని, పోలవరం పనులను నిలిపేశారని నారా లోకేష్ అన్నారు. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనాలోచితంగా పీపీఏలను రద్దుచేశారన్నారు. ఫ్యాక్స్ కాన్, అమర్ రాజా, జాకీ వంటి పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమేశాన్నారు. కులముద్రవేసి వేధించడంతో దేశంలోనే పేరెన్నికగన్న వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఒరిస్సా వెళ్లి 1200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేసుకుందన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ట్రాన్స్ పోర్టు, క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం టిసిఎల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ను నిర్బంధించారని లోకేష్ ఆరోపించారు. చివరకు ఈ విషయం పీఎంవోకి చేరి తీవ్రంగా మందలించడంతో వెనక్కితగ్గారన్నారు.
పరిశ్రమలు ఎలా వస్తాయి?
ఇలాంటి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఉన్నచోట పరిశ్రమలు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. జగన్ చేతగానితనం, అహంకారం వల్లే పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయన్నారు. స్వతహాగా జగన్ ఒక ఫ్యాక్షనిస్టుఅని, ఎటువంటి అభివృద్ధి చెందకుండా ప్రజలు తాము విసిరే చిల్లరకోసం ఎదురుచూస్తూ ఉండాలన్నది ఫ్యాక్షనిస్టు నైజం అని అన్నారు. చంద్రబాబు విజన్ వల్లే లక్షలాది యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. జగన్ విధ్వంసక పాలనలో యువతకు ఉద్యోగాలు లేవని, చదువుకునే పిల్లలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ ఎత్తేశారన్నారు, విదేశీవిద్య పథకాన్ని నాశనం చేశారన్నారు.