చిత్తూరు జిల్లాలో ఎన్ఐఏ సోదాల కలకలం
ఆంజనేయులు మాజీ నక్సలైట్. ఆయన నక్సలైట్ ఉద్యమం నుంచి బయటికి వచ్చి.. మదనపల్లెలో సమోసాలు అమ్ముకుంటూ జీవనం..
మదనపల్లె : చిత్తూరు జిల్లాలో ఎన్ఐఏ అధికారులు చేసిన సోదాలు.. స్థానికంగా కలకలం రేపింది. అంతేకాదు మదనపల్లెలో ఆంజనేయులు అలియాస్ అంజి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో.. ఏం జరుగుతుందో తెలియక స్థానికులు అయోమయానికి గురయ్యారు. నిన్న అంజిని ఎన్ఐఏ బృందం అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లింది. అతని ఇంట్లో సుమారు 6 గంటల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు.
కాగా.. ఆంజనేయులు మాజీ నక్సలైట్. ఆయన నక్సలైట్ ఉద్యమం నుంచి బయటికి వచ్చి.. మదనపల్లెలో సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నక్సలైట్ ఉద్యమాన్ని వీడినా.. అతను మావోయిస్టులకు రహస్యంగా సమాచారం అందిస్తూ.. కొత్తవారికి శిక్షణ ఇస్తున్నాడని అభియోగాలు వచ్చాయి. ఆ అనుమానంతోనే ఎన్ఐఏ అధికారులు ఆంజనేయులు అలియాస్ అంజిని అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆంజనేయులుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జన జీవన స్రవంతిలో కలిసి ప్రశాంతంగా బతుకుతున్న తమను వేధిస్తున్నారని ఆంజనేయులు భార్య సుగుణ వాపోయింది.