నేడు నామినేషన్ల పరిశీలన... ఏకగ్రీవమవుతాయా?
నేడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు.
నేడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు స్థానాలకు గాను నాలుగు నామినేషన్లు వేశారు. వైసీపీ నుంచి గొల్ల బాబూరావు, మేడా శివనాధ్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి నామినేషన్లు దాఖలు చేయగా, నెల్లూరుకు చెందిన ప్రభాకర్ నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
తెలంగాణలోనూ...
అయితే ఈరోజు స్క్రూట్నీలో ప్రభాకర్ నాయుడు నామినేషన్ పరిశీలనలో సక్రమంగా ఉంటే మాత్రం ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అలా కాకుండా ప్రభాకర్ నాయుడు నామినేషన్ తిరస్కరణకు గురయితే మాత్రం ముగ్గురు వైసీపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే. మరికాసేపట్లో ఈ విషయం తేలనుంది. మరోవైపు తెలంగాణలోనూ మూడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు మాత్రమే నామినేషన్లు వేయడంతో ముగ్గురూ ఏకగ్రీవం అయ్యే అవకాశముంది.