Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఏకాదశి దర్శనాలకు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఏడాది డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకూ పది రోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం ఉంటుంది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఏడాది డిసెంబరు 23వ తేదీ నుంచి జనవరి 1వతేదీ వరకూ పది రోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం ఉంటుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది. తిరుమలలో ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదకి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. అందుకోసం ముందుగానే అన్ని ఏర్పాట్లను ప్రారంభించింది. వైకుంఠ ఏకాదశి టిక్కెట్లను, మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఈ నెల 10వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు.
నేడు తిరుమలలో రద్దీ...
నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 59,335 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,205 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.29 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.