నేడు మంగళగిరిలో మన ఇల్లు - మన లోకేష్
మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమం నేడు మంగళగిరిలో జరగనుంది;

మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమం నేడు మంగళగిరిలో జరగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు మంత్రి నారా లోకేష్ పంపిణీ చేయనున్నారు. పేదలకు శాశ్వత ఇంటిపట్టాలను లోకేష్ పంపిణీ చేయనున్నారు.
వంద పడకల ఆసుపత్రికి...
ఉదయం మహానాడు 1 వద్ద 478, మధ్యాహ్నం డ్రైవర్స్ కాలనీ వద్ద 119, సలాం సెంటర్ కు చెందిన 92, ఉండవల్లి సెంటర్ లో 85, సీతానగరంలో48, పద్మశాలీ బజార్ లో 9, ఉండవల్లి లో 1 మొత్తంగా 832 మంది లబ్దిదారులకు ఏప్రిల్ 13 న శాశ్వత ఇంటి పట్టాలు నారా లోకేష్ అందజేస్తారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. నేడు మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రికి కూడా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు.