కలుషిత ప్రసాదం తిని 79 మంది అస్వస్థత
దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అన్ని గణేష్ మండలపాల వద్ద వినాయకులను ప్రతిష్టంచి పూజా..
దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అన్ని గణేష్ మండలపాల వద్ద వినాయకులను ప్రతిష్టంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే వచ్చిన భక్తులకు ప్రసాదాలు అందించారు. ఈ నవరాత్రుల్లో ప్రజలు ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోనున్నారు. కాగా తిరుపతి జిల్లా కేవీబిపురం మండలం ఆరె గ్రామంలో జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామంలోని ఆలయంలో పంపిణీ చేసిన కలుషిత ప్రసాదం తిని 79 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రసాదం కారణంగా గ్రామంలోని ప్రజలు తీవ్ర అశ్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రసాదం తిన్న వెంటనే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు.
విషయం తెలుసుకున్న అధికారులు, వైద్యాధికారులు ఆ గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందిస్తున్నారు. గుడిలోని వినాయక ప్రసాదాన్ని భక్తులు గ్రామంలోని ఇంటింటికి పంచినట్లు తెలుస్తోంది. ప్రసాదం తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు అయినట్లు గ్రామస్తులు తెలిపారు.