అనారోగ్యంతో ఉన్నా.. హాజరు కాలేను

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.;

Update: 2022-01-17 07:22 GMT
raghu rama krishna raju, employees, prc, andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తాను అనారోగ్యం వల్ల ఈరోజు విచారణకు హాజరుకాలేనని తెలిపారు. ఢిల్లీ వెళ్లాక అనారోగ్యానికి గురయ్యానని, విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని రఘురామకృష్ణరాజు అని సీఐడీ పోలీసులకు రాసిన లేఖలో కోరారు.

ఈరోజు విచారణకు....
వాస్తవానికి ఈరోజు సీఐడీ విచారణకు రఘురామకృష్ణరాజు హాజరు కావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో నమోదయిన కేసుకు సంబంధించి కొన్ని రోజుల ముందు సీఐడీ అధికారులు రఘురామకృష్ణరాజు కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News